Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనవడైన రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మెర్కెల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 600 మంది అతిథులు ఈ వేడుకలో పాల్గొని, వధూవరులకు అభినందనలు తెలిపారు. విండ్సర్ కోటలోని ప్రఖ్యాత సెయింట్ జార్జ్ ప్రార్థన మందిరం ఈ పెండ్లికి వేదికైంది. ఈ రాయల్ వెడ్డింగ్ కోసం బ్రిటన్ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పెండ్లిని వీక్షించేందుకు విండ్సర్ వీధుల్లో దాదాపు 10 వేల మంది బారులు తీరారు. ప్రిన్స్, మేఘన్ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. కాగా, బ్రిటన్ రాచ కుటుంబంలో జరిగిన ఈ పెండ్లి వేడుకను ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1.9 బిలియన్ (190 కోట్ల మంది) మంది వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించినట్టు బ్రిటిష్ మీడియా ప్రకటించింది.