Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏథెన్స్ : గ్రీస్ మేయర్ ఇయానిస్ బౌటారిస్పై దాడి జరిగింది. ఓ వర్గానికి చెందిన సభ్యులు ఆయనపై భౌతికదాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం థెసాలొనికి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇయానిస్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...పాంటిక్ గ్రీక్ అసోసియేషన్ సభ్యులు తీసిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. మెకడోనియా వివాదంపై నిరసనకారులు గ్రీస్ మేయర్ అభిప్రాయాన్ని కోరారు. అయితే, ఇయానిస్ చెప్పిన అభిప్రాయంపై విబేధించిన నిరసనకారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మేయర్ తలపై, ఛాతిభాగంపై పిడిగుద్దులు గుప్పించారు. అడ్డువచ్చిన వారందరిని చితకబాదారు. దీంతో, థెసాలొనికి ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఘటనాస్థలానికి చేరుకున్న ప్రత్యేక బృందాలు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పలువురు నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇయానిస్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.