Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక మాధ్యమంలో వీడియో వైరల్
బీజింగ్ : వరదల్లో చిక్కుకున్న ఓ మహిళను రక్షించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. పీపుల్స్ డైలీ ఆఫ్ చైనా ట్విట్టర్ అకౌంట్లో 46 సెకండ్ల నిడివితో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..వరదల్లో చిక్కుకుని ఓ కారు కొట్టుకుపోతుంటే.. ఓ వ్యక్తి వచ్చి ఆ కారులో ఉన్న మహిళను కాపాడేందుకు ప్రయత్నించాడు. కారు వరదల్లో చిక్కుకుని ఉంటే... దాంట్లో ఎవరైనా ఉండొచ్చన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆ కారుపై దూకాడు. పక్కన రోడ్డుపై ఉన్న వ్యక్తి ఓ రాయి లాంటి దాన్ని విసరడంతో... దాని సహాయంతో కారుపై ఉండే అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా... ఇంతలో మరో ఇద్దరు కూడా వరదలో ఈదుకుంటూ వచ్చారు. వారు కూడా కారు అద్దాలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కారు పై అద్దాలను పగలగొట్టి.. అందులో ఉన్న ఓ అమ్మాయిని కాపాడిన వ్యక్తి వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్గా మారింది. ఈవీడియోపై నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఆ వ్యక్తి ధైర్యసాహసాలను ప్రశంసించారు.