Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు
హవానా : క్యూబాలో ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన ఓ బ్లాక్‌బాక్స్ లభించింది. ఈ విమానంలో రెండు బ్లాక్‌బాక్సులు ఉన్నాయి. దర్యాప్తునకు బ్లాక్‌బాక్స్ ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో లభ్యమైన బ్లాక్‌బాక్స్ సక్రమంగా పని చేస్తున్నదని అన్నారు. ఈ ప్రమాదానికి కారణమేమిటో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. హవానా విమా నాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే ఈ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 110 మంది మరణించారు. క్యూబా రవాణా మంత్రి అదెల్ మాట్లాడుతూ రెండో బ్లాక్‌బాక్స్ త్వరలోనే దొరుకుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో 110 మంది మరణించారని, వీరిలో 11 మంది విదేశీ ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ముగ్గురు మహిళలు కాలిన గాయాలతో బయటపడినప్పటికీ, వారి పరిస్థితి విష మంగా ఉందని తెలిపారు.ప్రమాదానికి గురైన బోయింగ్ 737 విమానం 40 ఏండ్ల నాటిదని గుయాంగ్స్ సివిల్ ఏవియేషన్ బాడీ చీఫ్ కెప్టెన్ ఎగ్బర్ట్ చీఫ్ తెలిపారు. హవానాకు 20 కి.మీ. దూరంలో ఇది కూలిపోయింది. మృతులకు నివాళులర్పించిన క్యూబా, రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది.