Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది. గతంలో ట్రంప్ చెయ్యి పట్టుకుంటుంటే మెలానియా వదిలించుకున్న దృశ్యా లు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా తన భార్యను ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన ట్వీట్ వార్తల్లో నిలిచింది. ఇటీవల మెలానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శనివా రం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి శ్వేతసౌధానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ట్వీట్ చేస్తూ..'మన ఫస్ట్‌లేడీ 'మెలానీ' మళ్లీ వైట్‌హౌస్‌కి రావడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారు. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. అయితే మెలానియా పేరును మెలానీగా పేర్కొనడంతో దీనిపై నెటిజన్ల దృష్టిపడింది. అయితే ఈ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ట్రంప్ ట్వీట్ డిలీట్ చేసి మెలానియా పేరును సరిచేశారు. కానీ, అప్పటికే ఈ ట్వీట్ స్క్రీన్షాట్లు తీసి నెటిజన్లు పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.