Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వయసుతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషులందరిలోనూ రుగ్మతలు
- ఆరోగ్య బీమా సంస్థ 'బ్లూక్రాస్ బ్లూషీల్డ్' నివేదిక
వాషింగ్టన్ : వయసుతో సంబంధం లేకుండా అమెరికాలోని స్త్రీ, పురుషులందరిలోనూ తీవ్రమైన 'మానసిక రుగ్మతలు' పెరిగి పోతు న్నాయి. కారణాలేవైనప్పటికీ, ముఖ్యంగా మహిళలు అత్యధిక సంఖ్యలో మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. అయితే అమెరికాలో ఇదేమీ కొత్త విషయం కాకపోయినప్పటికీ, మానసిక రుగ్మతల స్థాయి ఇంతకుముందుకంటే గణనీయంగా పెరిగిందని, ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవు తున్నవారంతా తప్పకుండా చికిత్స తీసుకోవాల్సిమందేనని ఆరోగ్య బీమా సంస్థ 'బ్లూక్రాస్ బ్లూషీల్డ్' (బీసీబీఎస్) ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. ఆరోగ్య బీమా చేయించుకున్న 4.1కోట్లమంది నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి, 2013-16 మధ్యకాలంలో 'డిప్రెషన్' బారినపడ్డ కేసులు 33శాతం పెరిగాయని నివేదిక తెలియజేసింది. ఇక వయసులవారిగీ విశ్లేషణ చేయగా, టీనేజ్లో ఉండేవారిలో మానసిక రుగ్మతలు 63శాతం పెరగగా, 18-34ఏండ్ల మధ్యగలవారిలో 47శాతం పెరిగింది. యుక్త వయస్సు పిల్లల్లో మానసిక ఆందోళనలు, ఒత్తిడులు పెరిగిపోతున్నాయి. 1930నుంచి ఈ కేసులు పెరగటమేగానీ, తగ్గిన దాఖలాలు లేవు. ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, అమెరికాలో చికిత్సా కేంద్రాలు తగినంతగా విస్తరించలేదు. కొన్నాండ్ల కింద ఏస్థాయిలో ఉందో అదే స్థాయిలో చికిత్సా కేంద్రాలు ఉన్నాయని ఎంఐటీ, హార్వార్డ్ సైక్రియాట్రిక్ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ స్టీవ్ హేమాన్ అన్నారు. 'బ్లూక్రాస్ బ్లూషీల్డ్' తాజా నివేదికను బట్టి, ఎంతో మంది చికిత్స అవసరముందని గుర్తించాలన్నారు. అమెరికా సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, రుగ్మతల స్థాయిలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరైన చికిత్స కోసం ఎంతోమంది వేచిచూస్తున్నారు. నేటి సంక్లిష్టమైన సమాజం, జీవన విధానం మనుషుల్లో అనేక మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. ఆరోగ్య విధానాల్ని రూపకల్పన చేసేవారు దీనిపై ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంది. చికిత్సా విధానాల్ని మెరుగుపర్చటంపై దృష్టిసారిస్తేనే...సమస్య తీవ్రతను తగ్గించగలమని నివేదిక అభిప్రాయపడింది.