Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : మెక్‌డొనాల్డ్స్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌లో పనిచేస్తున్న 10 మంది మహిళా ఉద్యో గులు ఆసంస్థపై వ్యాజ్యం దాఖలు చేశారు. తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నామని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, మెక్‌డొనాల్డ్స్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌పై దావా వేసేం దుకు తమకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఫైట్‌ఫర్ డాలర్15 సంస్థను ఆశ్రయించామని అన్నారు. తాము పనిచేస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే విషయాన్ని రెండేండ్ల కిందటే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి నప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవారిపై యాజ మాన్యం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిం చారు. యూఎస్ ఈక్వల్ ఎంప్లాయిమెంట్ ఆపర్చు నిటీస్ కమిషన్‌లో కూడా లైంగిక వేధింపుల అంశంపై ఫిర్యా దు చేశామన్నారు. మెక్‌డొనాల్డ్స్ షేర్‌హోల్డర్స్ సమా వేశంలో మరో రెండు రోజుల్లో ఇలినాయిస్‌లోని ఓక్ బ్రూక్ నగరంలో జరుగనుంది. ఈ సమావేశంలో లైంగికవేధింపుల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా, తమ సంస్థలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పిస్తున్నామని, లైంగిక వేధింపుల ఘటనలు ఇప్పటి వరకు చోటుచేసు కోలేదని మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధి టెర్రీ హిక్కీ తెలిపారు.