Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: ఈ ఏడాది చైనా సుమారు 22వేల అశ్లీల వెబ్సైట్లను నిలిపివేసింది. 390 కేసుల్లో భాగంగా 17.5లక్షల ఐటమ్స్‌ను తొలగించినట్టు చైనాకు చెందిన సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రధానమైన కేసుల్లో దృష్టిని సారించినట్టు వారు తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 50 కేసులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పోర్నోగ్రఫీని అడ్డుకునేందుకు ఎంత శ్రమించినా..మళ్లీ సులువుగా అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఇవి చిన్నారులపై మానసికంగా, భౌతికంగా ప్రమాదకరమని అన్నారు. పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయం ఎక్కడ కనిపించిన వెంటనే తొలగించాలని అధికారులు చెప్పినట్టు చైనా ప్రభుత్వ పత్రిక జిన్హువా పేర్కొంది.