Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మంగళ, బుధవారాల్లో కిమ్ చైనాలో పర్యటిస్తారని ఉత్తర కొరియా స్టేట్ మీడియా వెల్లడిం చింది. ఈనెల 12న సింగపూర్ లో కిమ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరి సమావేశంతో పూర్తిస్థాయి అణు నిరాయుధీకరణకు కొరియా అంగీకరించింది. అయితే ట్రంప్‌తో సమావేశం జరిగిన వారం రోజులకే కిమ్ చైనా పర్యటనకు వెళ్తుండటం గమనార్హÛం. కిమ్ పర్యటన నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్‌లో భద్రత పెంచారని, విమానాశ్రయం వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ట్రంప్, కిమ్ జోంగ్‌ల భేటీకి సంబంధించి చైనా ప్రత్యక్షంగా అందులో పాల్గొనకపోయినా తెర వెనుక చైనా హస్తం ఉంటుందనే విషయం తెలిసిందే. ఉత్తర కొరియా, అమెరికాల సదస్సు నేపథ్యంలో ఉ.కొరియాపై ఆంక్షలను తొలగించాలని చైనా ఐరాస భద్రతా మండలికి సిఫారసులు చేసింది.