Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అదుపులో కీలక నిందితుడు
లండన్ : లండన్ సౌత్‌గేట్ ట్యూబ్స్టేషన్లో పేలుడు కేసులో కీలక నిందితున్ని అరెస్ట్ చేసినట్టు బ్రిటన్ పోలీసు అధికారులు తెలిపారు. పేలుడు కోసం నిందితుడు డ్రిల్ బ్యాటరీని ఉపయోగించినట్టు ప్రాథ మిక విచారణలో వెల్లడైందన్నారు. నిందితునికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఈ ఘటనకు ఉగ్రవాదంతో సంబంధంలేదని పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్ష్యులు సమాచారం అందిం చడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఘటనాస్థలాన్ని లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ సందర్శించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.