Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : అమెరికా నుంచి ఎఫ్-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు టర్కీ పేర్కొంది. కాగా, గత కొంతకాలం నుంచి అమెరికా, టర్కీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. టర్కీకు ఆయుధాలు, యుద్ధ విమానాల సరఫరా నిలిపివేయాలని యూఎస్ కాంగ్రెస్ పేర్కొంది. అయితే, యూఎస్ కాంగ్రెస్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా తమకు యుద్ధవిమానాలు సరఫరా చేస్తున్న కంపెనీలకు టర్కీ డిప్యూటీ ప్రధాని బేకిర్ బోజ్డార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా, అమెరికా తమకు యుద్ధ విమానాల సరఫరా నిలిపివేసినట్టయితే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడతామని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లాత్ కవుసోగ్లూ గతవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి యుద్ధ విమానాలు సరఫరా చేసుకుంటామని అన్నారు. అంతేగాకుండా, యుద్ధ విమానాల తయారీ కేంద్రాలను టర్కీలో ప్రారంభిస్తామని అన్నారు.