Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేమ్ : దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భార్య సారా నెతన్యాహూపై అవినీతి కేసు నమోదు చేసినట్టు ఇజ్రాయిల్ న్యాయశాఖ గురువారం వెల్లడిం చింది. ఆమెతో పాటు ప్రధాని కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఇజ్రా సైదాఫ్పై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపింది. ఆమె 100,000 డాలర్ల (రూ.67,82,500) ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని కార్యాలయం ద్వారా ఆమె తన అవినీతి కార్యకలాపాలు కొనసాగించినట్టు విచారణలో వెల్లడైందని న్యాయశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, తాను ఎలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడలేదని, తనపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని మీడియా ప్రతినిధులతో సారా తెలిపారు.