Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : రష్యా, అమెరికా అధ్యక్షుల మధ్య జరిగే సమావేశం ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనే దిశగా మొదటి చర్య కాగలదని రష్యా అధ్యక్ష భవనం ఆశిస్తోంది. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడాలన్నదే రానున్న రోజుల్లో జరగబోయే ఈ సమావేశం లక్ష్యమని రష్యా అధ్యక్షుని సహాయకుడు యూరి ఉషకోవ్ వ్యాఖ్యానించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని, పరస్పర ఆమోదయోగ్యమైన స్థాయిలో విశ్వాసాన్ని పునర్నిర్మించుకోవాలని, పరస్పర ప్రయోజనాలు కలిగిన అంశాలపై సహకరించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఈ సమావేశం కీలకంగా మారిందని మీడియాకు సమావేశం వివరాలు వెల్లడిస్తూ తెలిపారు. సోమవారం ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో అధ్యక్ష భవనంలో పుతిన్, ట్రంప్‌లు ప్రైవేటు సమావేశం నిర్వహించనున్నారు. ఇరు నేతలు ప్రైవేటుగా చర్చలు జరిపి, అనంతరం ప్రతినిధి బృందాలతో కూడా సమావేశమై చివరికి సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొంటారని ఉషకోవ్ తెలిపారు.