Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డమాస్కస్: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరం నుంచి భారీగా ఆయుధాలను, బాంబులను , రాకెట్లను సిరియన్ అరబ్ ఆర్మీ స్వాధీనం చేసుకొంది. ఈ ఆయుధాలన్నీ చాలా వరకు అమెరికాలో తయారైనవి కావడం గమనార్హం. డైర్ఎజోర్ ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదుల ఆయుధాల డంప్ తాజాగా బయటపడింది.
సిరియా దళాలు మిత్రపక్షాలతో కలిసి డైర్ఎజోర్ ప్రావిన్స్‌లో దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయుధ డంప్‌ను గుర్తించాయి. ఇక్కడ భారీగా ఆయుధాలు, కమ్యూనికేషన్ సాధనాలు, అమెరికాలో తయారైన మోర్టార్ షెల్స్‌ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వదిలివెళ్లారు. వీటిల్లో బీఎం-21 గ్రేడ్ రాకెట్లు, 107 ఎంఎం రాకెట్లు, 40 ఎంఎం మోర్టార్లు, యాంటీ ట్యాంక్ మిసైల్స్, కాంబాట్ నెట్ రేడియో, పేలుడు పదార్థాలు ఉన్నాయి.
గతవారం సిరియా దళాలు ఐఎస్ ఉగ్రవాదుల వద్ద ఫ్రాన్స్‌లో తయారైన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకొన్నాయి. వీటిల్లో అపిలాస్ వ్యవస్థ, యాంటీ ట్యాంక్ వ్యవస్థ వంటివి ఉన్నాయి. జులై 12వ తేదీన డిరా పట్టణంపై పట్టును తెచ్చుకున్నాయి. దీంతో సిరియా దళాలు పలు భవనాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేశాయి. పలు సాయుధ గ్రూపులు కూడా లొంగిపోయాయి.