Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూ వినతిని తోసిపుచ్చిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌పై విధించిన ఆంక్షల నుంచి అక్కడి తమ కంపెనీలకు మినహాయింపు నివ్వాలంటూ ఐరోపా దేశాల కూటమి ఉన్నత స్థాయిలో చేసిన విజ్ఞప్తులను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అణు కార్యక్రమాలకు తెరదించే విషయంలో ఇరాన్‌పై ఒత్తిడి గరిష్ట స్థాయిలో పెంచే ఉద్దేశంతో ఆంక్షలు విధించామని, ఈ ఆంక్షల నుండి ఎవరికీ మినహాయింపు వుండబోదని ఐరోపా దేశాల కూటమికి రాసిన లేఖలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఈ కంపెనీలు అమెరికా జాతీయ భద్రతకు ప్రయోజనకరంగా వ్యవహరించినపుడు మాత్రమే తాము ఆంక్షల నుండి మినహాయిస్తామని ఆయన వివరించారు. ఇరాన్‌పై అమెరికా విధించిన తాజా ఆంక్షలతో తమ సభ్యదేశాలు కొనసాగిస్తున్న వందల వేల కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యానికి దెబ్బతగులుతుందని ఐరోపా కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది.