Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా ప్రతిపాదన
మాస్కో: అమెరికా ఆంక్షల నేపథ్యంలో కరెన్సీ కొరతతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రష్యా ఈ సంక్షోభ పరిస్థితిని అధిగమించేందుకు టర్కీతో కరెన్సీ మార్పిడి ఒప్పందం ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న డాలర్ ప్రభావాన్ని అధిగమించేందుకు వీలుగా రష్యన్ రూబుల్తో టర్కీ కరెన్సీ లీరాను మార్పిడి చేసుకోవాలని రష్యా ప్రతిపాదిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్య కార్యకలాపాలలో జాతీయ కరెన్సీని వినియోగించుకునే అంశాన్ని రష్యా దీర్ఘకాలంగా వివిధ స్థాయిల్లో ప్రతిపాదిస్తూనే వుందని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ గుర్తు చేశారు. ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. రష్యాతో ఉమ్మడి ప్రాజెక్టులను అమలు చేయటం ద్వారా టర్కీ ఆర్థిక, ద్రవ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూ వుండబోదని ఆయన స్పష్టం చేశారు.