Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్యసమితి: శరణార్థి సంక్షోభం వాస్తవానికి ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాలను కుదిపేస్తున్నది తప్ప ఐరోపా దేశాలను కాదని ఐరాస స్పష్టం చేసింది. ఐరాస శరణార్థి వ్యవహారాల హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండి గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఐరోపా, జర్మనీలలో ఎక్కడా శరణార్థి సంక్షోభ పరిస్థితులు లేవని, వాస్తవానికి ఈ సంక్షోభం ఇతర ప్రదేశాలలో కొనసాగుతోందని అన్నారు. 2015లో ఐరోపా దేశాలు, ప్రధానంగా జర్మనీలోకి పెద్దయెత్తున శరణార్థులు వెల్లువెత్తటంతో సంక్షోభం ఏర్పడిన మాట నిజమేనని, అయితే వాస్తవానికి ఈ సంక్షోభం ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాలలో కొనసాగుతున్నదని ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.