Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెటిజన్ల వెక్కిరింతలు
కరోలినా : వార్తను వైవిధ్యంగా ప్రదర్శించాలనే అత్యుత్సాహంతో ఓ రిపోర్టర్ చేసిన పని సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని తూర్పు తీరంలో హరికేన్ ఫ్లోరెన్స్ అక్కడి ప్రజలను వణికిస్తోంది. హరికేన్ కారణంగా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. స్థానిక మీడియా సంస్థకు చెందిన ఓ రిపోర్టర్ ఈ హరికేన్ వార్తలకు సంబంధించి రిపోర్టింగ్ చేస్తున్నాడు. బలమైన గాలులు వీస్తుండటంతో సదరు విలేకరి సరిగ్గా నిలబడలేక అటూ ఇటూ ఊగుతున్నాడు. అయినా సరే రిపోర్టింగ్ ఆపకుండా గాలి ఎక్కువగా వీస్తోంది అంటూ చెప్పసాగాడు.
అయితే, సరిగ్గా అదే సమయంలో రిపోర్టర్ వెనుకవైపు నుంచి ఇద్దరు వ్యక్తులు ఎలాంటి గాలి ప్రభావం లేకుండా మామూలుగా నడుచుకుంటూ వెళ్లిపోవడం కన్పించింది. ఇంకేముందు రిపోర్టర్ అత్యుత్సాహం కాస్తా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్‌మీడియాలో పోస్టు చేయగా.. ఇప్పుడది వైరల్‌గా మారింది. దీంతో సదరు రిపోర్టర్‌పై నెటిజన్లు చురకలంటించారు. వార్తను వాస్తవికంగా చెప్పే ప్రయత్నంలో కాస్త ఓవర్‌యాక్షన్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.