Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా సాయం చేస్తోంది: జార్జియా మాజీ మంత్రి
టిబిలిసి : అమెరికా ఆర్థిక సాయంతో జార్జియాలో కొనసాగుతున్న ఒక ఔషధ పరీక్షా కేంద్రంలో జీవాయుధాలు తయారవుతున్నాయని జార్జియా మాజీ రక్షణ మంత్రి ఆరోపించారు. అయితే జార్జియా ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆర్ లూగర్ సెంటర్ ఫర్ పబ్లిక్ హెల్త్ రిసెర్చ్ అనేపేరుతో కొనసాగుతున్న ఈ ఔషధ పరీక్షా కేం ద్రం అమెరికా జీవాయుధ తయారీ ప్రాజెక్టుకు ముసుగుగా కొనసాగు తోందని జార్జియా మాజీ మంత్రి ఇగర్ జియోర్గడ్జ్ స్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల లీయిన కొన్ని పత్రాలను ఆయన మీడి యాకు చూపించారు. ఈ కేంద్రం తీరు తెన్నులపై దర్యాప్తు చేస్తే దీని వెనుక ఉన్న చీకటి రహస్యాలు బయటపడతాయని ఆయన ఒక మీడి యా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక్కడ ఎటువంటి వైద్య కేంద్రం కానీ, లేదా ఆస్పత్రి కానీ లేదని ఆయన వివరించారు. అమెరికా కు చెందిన డిఫెన్స్ థ్రెట్ రిడక్షన్ ఏజెన్సీ (డిటిఆర్ఎ) ఆధ్వర్యంలో కొనసా గుతున్న ఈ కేంద్రానికి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ నిధులు సమకూ రుస్తోందన్నారు. ఈ కేంద్రం చుట్టూ పుకార్లు వ్యాపిస్తున్నప్పటికీ ప్రారం భం నుండి దీని పరిసరాలలో కొన్ని అనుమానాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. 2011లో ప్రారంభమైన ఈ కేంద్రం జార్జియాలోని ఒక మారుమూల గ్రామంలో వుంది. తమకు తరచు తలనొప్పి, ఇతర అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఈ కేంద్రం నుండి ఒక వింతైన వాసన వస్తోందని ఈ కేంద్రం పరిసర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ కేంద్రం పనిచేయటం ప్రారంభమైన నాటి నుండి జార్జియాలో కొన్ని వ్యాధులు ప్రబలిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయన్నారు. ఆయన మీడియాకు చూపిన పత్రాల ద్వారా క్రిమియన్-కాంగో హెమరోజిక్ ఫీవర్, ఇతర వ్యాధికారక క్రిములపై పరిశోధనలకు అమెరికా గ్రాంట్లు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కాగా యాదృచ్చికమే అయినప్పటికీ ఎన్సిడిసి డేటా ప్రకారం జార్జియాలో తొలిసారిగా క్రిమియన్-కాంగో హెమరోజిక్ ఫీవర్ 2009-12 మధ్య కాలంలో వెలుగు చూసింది. అదే విధంగా ఇక్కడే అత్యంత ప్రమాద కరమైన ఆర్థోపాక్సీ వైరస్ కూడా 2013లో తొలిసారిగా తెరపైకి వచ్చిం ది. ఈ ఔషధ పరిశోధనా కేంద్రంలో కొనసాగుతున్న కొన్ని చీకటి ప్రయో గాలను తనకు లభించిన పత్రాలు వెలుగులోకి తెస్తున్నాయని జియోర ్గడ్జ్ చెబుతున్నారు. ఇందులో కొన్ని ప్రయోగాలలో కొందరు వ్యక్తులు మృత్యువాత పడ్డారని, ఆయన వివరించారు. ఈ కేంద్రానికి చెందిన మరికొన్ని ఫైళ్లలో సైనిక సంబంధిత పరిశోధనలు, జీవాయుధ అభివృద్ధికి సంబంధించిన సమాచారం కూడా వుందన్నారు. కేంద్రం నుండి విష పూరితమైన దోమలను గాలిలోకి వదిలే డ్రోన్లను కూడా ప్రయోగిస్తు న్నారని ఆయన చెప్పారు. తనకు దాదాపు లక్షల పేజీల సమాచారం లభించిందని, దీనిని తాను విశ్లేషిస్తున్నానని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఏర్పాటు చేశానని ఆయన వివరించారు. ఈ పత్రాలలోని సమా చారాన్ని దశల వారీగా వెబ్సైట్లో పొందుపరుస్తానన్నారు.