Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా: టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సోమ వారం భేటీ అయి సిరియా లోని ఇడ్లిబ్ ప్రావిన్స్ పరి స్థితిపై చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. సిరియా సమస్యకు రాజకీయ పరిష్కారం కోరుకుం టున్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ విషయంలో ఇద్లిబ్‌లో రష్యాతో సైనిక ఘర్షణను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగం గానే సోమవారం రష్యాలోని శోచి నగరంలో ఇరువురు నేతలు భేటీ అవుతున్నారని ఈ వర్గాలు వివరించాయి. ఈ అంశంపైనే ఆదివారం ఇస్తాంబుల్ నగరంలో టర్కీ, ఫ్రాన్స్, రష్యా దేశాల ప్రతినిధులు భేటీ అవుతున్నారని, సిరియాలో శాంతి ప్రక్రియకు తాజా చొరవ చూపాలన్న లక్ష్యంతో ఈ భేటీ జరుగనుందని దౌత్యవర్గాలు తెలిపాయి.