Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కౌలాలంపూర్ : మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ అరెస్ట్ అయ్యారు. అవినీతి, అక్రమాస్తుల ఆరోపణల కేసులో ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తు న్నట్టు మలేషియా అవినీతి నిరోధక శాఖ అధి కారులు వెల్లడించారు. 628 మిలియన్ డాలర్ల (రూ.45,39, 49,80, 000) ప్రభుత్వ నిధులను తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకున్న ఆరోపణలు నజీబ్ ఎదుర్కొంటు న్నారు. ఆయనను గురువారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
గతంలోనూ నజీబ్పై మనీలాండరింగ్, అవినీతి కేసులు నమోదై ఉన్నాయి. మాజీ ప్రధానికి సంబంధించిన 270.2మిలియన్ డాలర్ల (రూ.19,53, 14,07,000) విలువైన ఆస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.