Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ అధ్యక్షుడు మెంగ్ హాంగ్వే(64) అదృశ్యంపై మిస్టరీ వీడలేదు. గతనెల 25న ఫ్రాన్స్‌లోని లియో నుంచి స్వదేశమైన చైనాకు చేరుకున్న తర్వాత ఆయన జాడ తెలియరాలేదు. హాంగ్వే ఇంటర్‌పోల్ అధ్యక్ష బాధ్యతలతో పాటు చైనా ప్రజా భద్రత శాఖలో ఉపమంత్రిగా ఉన్నారు. వారం రోజులు గడిచినా హాంగ్వే జాడ తెలియకపోవడంతో ఆయన భార్య ఫ్రాన్స్‌లోని ఇంటర్‌పోల్ అధికారులను ఆశ్రయించింది. అయితే,మెంగ్ హాంగ్వేను చైనా అధికారులు అదుపులోకి తీసుకుని ఉండొచ్చని ఫ్రాన్స్ ఆరోపిస్తున్నది. హాంగ్వే ఆచూకీ కనుగొనుటలో సహకరించాలని చైనాను కోరినట్టు పేర్కొంది. 2016లో ఇంటర్‌పోల్ చీఫ్‌గా ఎన్నికైన హాంగ్వే ఆ పదవిలో 2020 వరకూ కొనసాగుతారు. పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకోవడానికి రెడ్ నోటీసును, అదృశ్యమైనవారిని గుర్తించడానికి ఇంటర్‌పోల్ యెల్లో నోటీసును జారీచేస్తుంది.