Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 మంది మృతి, వందలాది మంది గల్లంతు
మాడ్రిడ్ : స్పెయిన్లో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మల్లోర్కా ద్వీపంలో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో, స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వరదల్లో చిక్కుకొని 9 మంది మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. వందలాది మంది గల్లంతయ్యారని అన్నారు. సహాయక బృందాలు ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రవాహంలో వందకు పైగా కార్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.