Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికా ఆర్థిక మంత్రి నహ్లానహ్లా ముస్లా నెనే తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు అధికమైన నేపథ్యంలో పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గత మార్చిలో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి చట్టవిరుద్ధంగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. తాను భారత సంతతికి చెందిన గుప్తా కుటుంబాన్ని కలిసినట్టు స్వయంగా నహ్లానహ్లా ఒప్పుకున్నారు. రాజీనామాను అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా అంగీకరించారు. తదుపరి ఆర్థిక మంత్రిగా సెంట్రల్ బ్యాంకు మాజీ చీఫ్ టిటో మోబోనీని బాధ్యతలు చేపట్టనున్నారు. 2014 నుంచి ఏర్పాటైన ఈ ఆర్థిక శాఖకు ఐదవ ఆర్థిక మంత్రిగా ఆయన వ్యవహరించనున్నారు. మాజీ ప్రెసిడెంట్ జాకబ్ జుమాతో కలిసిపని చేస్తున్నట్టు గుప్తా కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.