Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధిగా ఉన్న నిక్కీ హేలీ రాజీనామా చేశారు. ఎలాంటి ముం దస్తు ఊహాగానాలు లేకుండా ఆమె అకస్మాత్తుగా రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అయితే నిక్కీ రాజీనామా తరువాత ఆమె స్థానంలో ఎవరూ వస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇవాంకా ట్రంప్‌ని ఆ పదవిలో నియ మిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ట్రంప్ కూడా సంకేతాలు వెలు వరించారు. 'నిక్కీ తర్వాత అలాంటి డైనమిక్ అంబాసిడర్ అయ్యే అర్హతలు ఇవాంకాకి ఉందను కుంటున్నా. అయితే, నా కూతుర్ని ఎంపిక చేస్తే.. నాకు బంధుప్రీతి అని ఆరోపిస్తారేమో' అంటూ మీడియా సమావేశంలో ట్రంప్ తెలిపారు. అయితే ఈ వార్తల్ని ఇవాంకా కొట్టి పారేశారు. 'ప్రస్తుతం నేను వైట్ హౌస్‌లో చాలా గొప్ప వారితో కలిసి పనిచేస్తున్నాను. నిక్కీ హేలీ చాలా గొప్ప వ్యక్తి. ఆమె స్థానంలో అధ్యక్షుడు మరో గొప్ప వ్యక్తిని నియమిస్తారని నమ్ము తున్నాను. అయితే ఆ వ్యక్తి నేను మాత్రం కాదం'టూ ఇవాంకా ట్రంప్ తెలిపారు.