Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెకున్ ఉమన్ (గ్వాటెమాలా): అమెరికాకు బయల్దేరిన వేలాది మంది వలసదారులు మెక్సికో దక్షిణ ప్రాంతంలోని సరిహద్దు పట్టణం టెకున్ ఉమన్లోని ఆశ్రయ కేంద్రాలలో నిలిచిపోయారని స్థానిక అధికారులు చెప్పారు. అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే వారిని అడ్డుకునేందుకు మెక్సికన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టటం ఈ వలసదారులకు పెను సవాలుగా మారింది. మెక్సికో సరిహద్దుల్లోని సియుడాడ్ హిడాల్గో పట్టణంలో వున్న మూడు షెల్టర్లలో దాదాపు 5,100 మంది వలసదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని స్థానిక ప్రభత్వ అత్యవసర సేవల విభాగం అధిపతి గెరార్డో హెర్నాండెజ్ చెప్పారు. మరో 2000 మందికిపైగా శరణార్థులు రాత్రి ఆశ్రయం కోసం నగరంలోని సెంట్రల్ స్క్వేర్లో నమోదయ్యారని ఆయన వివరించారు. ఇక్కడ వలసదారులు కిక్కిరిసిపోయారని, అడుగు తీసి అడుగు వేయటానికి వీలులేని పరిస్థితి నెలకొన్నదని ఆయన వివరించారు. అయితే అందరూ ప్రశాంతంగానే వున్నారని ఆయన తెలిపారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి పట్టుబడిన దాదాపు 900 మంది వలసదారులను తాము షెల్టర్లకు తరలించినట్లు మెక్సికన్ ఫెడరల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. ఇందులో 600 మంది పేర్లను నమోదు చేసుకుని సంబంధిత ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం సరిహద్దులు దాటేందుకు అనుమతించామని తెలిపింది.