Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోల్సనారోకు వ్యతిరేకంగా...
బ్రెసిలియా: 28న జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఆల్ట్రా రైటిస్ట్ అభ్యర్థి జయిర్ బోల్సనారోకు వ్యతిరేకంగా బ్రెజిల్ మహిళలు మరోసారి భారీ నిరసన తెలియచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో బోల్సనారోకు సానుకూల పవనాలున్నట్టు తాజా ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్న నేపథ్యంలో బ్రెజిల్ మహిళలు ఇప్పటికే గత నెలలో ఒకసారి తమ నిరసనను తెలియచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శనివారం మహిళలు మరోసారి తమ గళమెత్తారు. దీనితో పాటు ఎన్నికల బరిలో వున్న లిబరల్ సోషలిస్టు పార్టీ (పీఎస్ఎల్)కు మద్దతుగా దేశంలోని 19 రాష్ట్రాల రాజధానుల్లో భారీయెత్తున ర్యాలీలు నిర్వహిం చేందుకు రంగం సిద్ధమైనట్టు బ్రెజిల్ పత్రిక ఫాటో బ్రెజిల్ తన వార్తా కథనంలో వివరించింది. ఈ ర్యాలీ లను లాండ్లెస్ రూరల్ వర్కర్స్ మూవ్మెంట్ (ఎంఎస్టీ) వంటి ఉద్యమ సంస్థలు ఇతర ప్రాంతా లకు విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. మాజీ సైనికాధికారి అయిన జియర్ బోల్సనారో దేశా ధ్యక్షుడిగా ఎన్నికైతే సైనిక నియంతృత్వ పాలన, చిత్ర హింసలు, మానవ హక్కుల దుర్వినియోగం, మైనా ర్టీల హక్కులను కాలరాయటం వంటి పరిణామాలు తప్పవని మహిళలు తమ ర్యాలీలో హెచ్చరించారు.