Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలోని క్లెమ్సన్ యూనివర్సిటీ పైకప్పు కూలిన ఘటనలో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. దక్షిణ కాలిఫోర్నియాలోని క్లెమ్సన్ వర్సిటీలో ఓ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్సిటీలో పురాతన నిర్మాణాలు ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని యూనివర్సిటీ ప్రెసిడెంట్ జిమ్ క్లెమెంట్స్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.