Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి, నిరాశ్రయులైన వందలాది మంది
మాడ్రిడ్ : దక్షిణ స్పెయిన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల్లో చిక్కుకొని ఫైర్‌మెన్ మృతి చెందగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వీధుల్లోకి,రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మలాగా ప్రావిన్స్‌లో వరద ఉధృతి అధికంగా ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కాంపిలోస్ నగరంలో వరద ప్రవాహంలో కార్లు కొట్టుకొనిపోయాయి. స్పెయిన్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం...ఆర్దేల్స్ నగరంలో గడిచిన 24 గంటల్లో 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.