Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్ థింక్ టాంక్ సర్వే రిపోర్టు
వాషింగ్టన్ : అమెరికాలో తెలుగు బాష మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత పదేండ్లతో పోలిస్తే అమెరికాలో అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న భాషగా తెలుగు రికార్డు సృష్టించింది. 2010-2017 మధ్య ఆ దేశంలో తెలుగు మాట్లాడేవారు 86శాతం పెరిగిందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించింది. అమెరి కాలో తెలుగు భాష హవా కొనసాగుతోందని అమెరి కన్ థింక్ టాంక్ అనే సంస్థ వెల్లడించింది. ఈ మేర కు ఆ సంస్థ చేపట్టిన సర్వే నివేదికను విడుదల చేసిం ది. దీనిలోని వివరాల ప్రకారం...గత ఏడాది అమెరి కాలో నాలుగు లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇది 2010లో తెలుగు మాట్లాడేవారితో పోలిస్తే రెట్టింపు అయింది. అమెరి కాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి పది భాషల్లో ఏడు భాషలు దక్షిణ ఆసియాకు చెందినవి కావడం విశేషం. కాగా అమెరికాలో ఆంగ్లం కాకుండా ఎక్కువగా మాట్లాడే టాప్ 20 భాష ల్లో మాత్రం తెలుగు స్థానం సంపాదించలేక పోయిం ది. విద్య, ఉద్యోగాల కోసం భారత్ నుంచి అత్యధి కంగా అమెరికాకే వలస వెళ్తున్న విషయం తెలిసిందే. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అమెరికాలో తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. టెక్నాలజీ, ఇంజినీరింగ్ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. అమెరికాను ఐటీ ఉద్యోగులను అత్యధికంగా సరఫరా చేస్తున్న నగరంగా హైదరాబాద్ పేరొందింది. అమెరికా అందిస్తోన్న హెచ్-1బీ వీసాల ద్వారా భారతీయులే అత్యధికంగా లబ్ధిపొందుతున్నారు. కాగా, భారత్లో తెలుగు బాషా నాలుగో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కలుపుకుని దేశ వ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎనిమిది కోట్లకు పైమాటే. అమెరికాలో మిగతా దేశాల సంప్రదాయం కంటే భారతీయ సంప్రదాయాలపైనే మక్కువ చూపుతున్నారు. అమెరికాలో అత్యంత ఎక్కువగా మాట్లాడే దక్షిణ ఆసియా భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. హిందీ, ఉర్దూ, గుజరాతీ భాషలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.