Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సూపర్ మానవుల'పై స్టీఫెన్ హాకింగ్ ఆందోళన
- అత్యంత ధారణాశక్తి, విపరీతమైన శారీరకబలంతో 'డిజైనర్ బేబీస్'
- వీరి ముందు సాధారణ మానవుడు నిలబడలేడు
- ధనవంతులకు, ధనిక దేశాలకు 'జెనెటిక్ ఇంజనీరింగ్' ఫలాలు: 'బ్రీఫ్ ఆన్సర్స్ టు బిగ్ క్వశ్చన్స్' పుస్తకంలో ప్రస్తావన
బ్లాక్‌హోల్స్ (కృష్ణ బిలాలు) లోపల ఏముంది? కాలంలో ప్రయాణం సాధ్యమా? మనకన్నా తెలివైన జీవులు విశ్వంలో మరోచోట ఉన్నారా? కృత్రిమ మేథస్సు మనల్ని మించిపోతుందా? ...ఇలాంటి ప్రశ్నలు ఎన్నో స్టీఫెన్ హాకింగ్‌ను అనేకమంది అడిగారు. క్లుప్తంగా, సరళంగా సాధారణ వ్యక్తులకు అర్థమయ్యే విధంగా వీటిపై ఆయన సమాధానమిచ్చారు. ఈ వ్యాసాల సంకలనంతో స్టీఫెన్ హాకింగ్ కుటుంబసభ్యులు, సహచరులు తీసుకొచ్చిన పుస్తకం 'బ్రీఫ్ ఆన్సర్స్ టు బిగ్ క్వశ్చన్స్'. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 16న విడుదలైంది. ఇందులో ఆయన ఆందోళన వ్యక్తం చేసిన 'సూపర్ మానవుల' సృష్టి గురించి సాధారణ ప్రజలు చర్చించాలని కోరుకున్నాడు.
న్యూయార్క్ : ప్రపంచ ప్రఖ్యాత థియరిటికల్ ఫిజిస్ట్ స్టీఫెన్ హాకింగ్ కొత్త పుస్తకం 'బిగ్ క్వశ్చన్స్' తెలుగులోనూ ప్రచురితం కాబోతోంది. అనేక ప్రశ్నలకు వివిధ సందర్భాల్లో ఆయన రాసిన వ్యాసాలు ఇందులో పొందుపర్చారు. అందర్నీ ఆశ్యర్యపరుస్తున్న, ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న... 'సూపర్ మ్యాన్' (సూపర్ మానవులు)ల గురించి ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు.
బ్లాక్‌హోల్స్, ఏలియన్స్‌పై ఆయన రాసిన పుస్తకాలు, చెప్పిన వివరాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి తెలుసు. ముఖ్యంగా ఏలియన్స్‌పై పరిశోధన మానవుడికి మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తుందని హెచ్చరించారు. ఏలి యన్స్ ఉన్నారో, లేదో తెలియదు. వారు ఉన్నారనే అనిపి స్తోంది. వారి జాడ కనుగొనాలన్న మానవుడి ఆతృత సరైంది కాదని చెప్పారు. కచ్చితంగా వారు మానవుడికన్నా అన్నివి ధాలా బలవంతులు కాబట్టి...భూమిపై మానవుడి మనుగడ ప్రమాదంలో పడుతుందని హాకింగ్ అన్నారు. అంతేగాక ఒక మానవ ఆవాసం కలిగిన 'భూమి' జాడ ఏలియన్స్‌కు తెలియజేటం మూర్ఖత్వం కిందకి వస్తుందని అన్నారు.
అంతరిక్షానికి సంబంధించి సామాన్యుడికి అర్థం కాని విషయాలెన్నింటినో హాకింగ్స్ పెద్ద ఎత్తున 'డిబేట్'కు పెట్టా డు. అలాగే విశ్వనానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలియజేశారు. మన చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్రమండలాలు...కోట్లాదిగా ఉన్నాయని తెలుసుకున్నాం. అయితే మనం ఇప్పటివరకూ ఈ విశ్వమొక్కటే ఉందని నమ్ముతున్నాం. కానీ ఇలాంటి విశ్వాలెన్నో (మల్టీవర్స్) ఉన్నాయని ఆయన అంచనావేశారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన కొత్త విషయం...'జెనెటిక్ ఇంజనీరింగ్' వల్ల భవిష్యత్తులో 'సూపర్ మనుషులు' తయారుకాబోతున్నారు.
ఇంతకీ సూపర్ మనుషులు అంటే ఎవరు?
ఇప్పటికే.. జంతువుల్లో, మొక్కల్లో 'జెనెటిక్ ఇంజనీరింగ్' ద్వారా డిజైన్డ్ మెటీరియల్‌ను తయారుచేస్తున్నాం. దీనినే 'నా నో ఇంజనీరింగ్' అని కూడా అంటారు. ఒక్కమాటలో చెప్పా లంటే మనకు కావాల్సిన రీతిలో రసాయన పదార్థాన్ని తయారుచేసుకోవటం. ఉదాహరణకు మొక్కజొన్నలో జన్య మార్పిడి జరిపి...నీటి ఎద్దడిని తట్టుకొనే విత్తనాల్ని తయారు చేయటం, బీటీ పత్తి వంటివి. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నా లజీ 'మనుషుల'కు కూడా విస్తరిస్తే జరిగేదే 'సూపర్ మను షుల' ఆవిర్భావం. అంటే సూప ర్మ్యాన్ తయారవుతాడు. డబ్బున్న వాడు అన్నింటినీ పొందుతున్నాడు. కానీ సంతానం విషయంలో అనుకున్నవిధంగా జరగటం లేదు. ఇప్పుడీ 'జెనెటిక్ ఇంజనీరింగ్'ను ఉపయోగించుకొని అత్యది óక తెలివితేటలు, అత్యంత శరీరధారుఢ్యమున్న పిల్లల్ని కనవ చ్చు. వీరిని 'డిజైనర్ బేబీస్' అనవచ్చు. వీరికి అత్యంత ధార ణాశక్తి(మెమోరీ), విపరీతమైన శారీరకబలం, కావాల్సినంత జీవతకాలం వీరికి ఉంటాయి. సాధారణ మానవుడు మహా అంటే 90 ఏండ్లు బతకటం గొప్ప. కానీ ఈ సూపర్ మనుషులు 300ఏండ్లు బతకటం పక్కా. అంతటి సామర్థ్యం ఉన్న పిల్లల్ని కనటం ముందు ముందు సాధ్యపడుతుంది.
నిత్య యవ్వనం, రోగాల్ని తట్టుకొనే సామర్థ్యం...జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా సాధ్యపడుతుంది. ఇక్కడ స్టీఫెన్ హాకిం గ్ సంధిస్తున్న పెద్ద ప్రశ్న ఏంటంటే...ఈ జెనెటిక్ ఇంజ నీరింగ్ ద్వారా డబ్బున్నవాళ్లు 'సూపర్ మానవుల్ని' సృష్టిస్తే? సాధారణ మనుషుల పరిస్థితి ఏంటి? అన్నది. 'బిగ్ క్వశ్చన్స్'రూపంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ధనవంతుల చెప్పుచేతుల్లోకి ప్రపంచం
జెనెటిక్ ఇంజనీరింగ్‌తో 'డాలీ' అనే గొర్రె పిల్లల్ని సృష్టిం చాం. ఒకేమాదిరి ఉన్న జంతువుల్ని సృష్టించటాన్ని మానవుడు ఇప్పటికే సాధించాడు. అయితే ఇదే సూత్రంతో మానవు ల్ని కూడా సృష్టించొచ్చు కదా? మనుషుల్ని పోలిన మనుషు ల్ని సృష్టించవచ్చు కదా? ప్రస్తుతానికి పరిస్థితులు సానుకూ లంగా లేకపోవటం వల్ల ఇది జరగటం లేదు. కారణం, ప్రపంచంలోని శాస్త్రవేత్తలు జెనెటిక్ ఇంజనీరింగ్‌తో మానవు ల సృష్టిని అంగీకరించటం లేదు. అన్ని దేశాల్లోనూ దీనిపై చట్టాలు ఉన్నాయి. నైతికంగా అనేక ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
చట్టాల్ని, నైతికపరమైన, సైంటిఫిక్ ఆంక్షల్ని తప్పించి...'సూపర్ మానవుల' సృష్టిగనుక జరిగితే ఏం జరుగుతుంది? అని ఆలోచిస్తే...సాధారణ మానవుల్ని తప్పకుండా తమ బానిసల్ని మార్చుకుంటుంది. కొన్ని దేశాల్ని వలస ప్రాంతాలుగా మార్చుకుంటారు. సూపర్ మానవులతోకూడిన ఒక దేశం మరో దేశాన్ని ఆక్రమించొచ్చు. ధనవంతులతో కూడిన సమాజం...మిగతా ప్రపంచాన్ని తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటుంది. వీలైతే భూమిని దాటి వీరి ఆధిపత్యం ముందుకు వెళుతుంది. గ్రహాల్ని సైతం తమ చెప్పుచేతుల్లో పెట్టుకునే అవకాశమూ ఉంటుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే 'సూపర్ మానవుల'పై, 'జెనెటిక్ ఇంజనీరింగ్'పై చర్చ జరగాలని హ్యాకింగ్ కోరుతున్నాడు.
కొత్తరకాలైన ఆధిపత్యాల్ని, కొత్తరకాలైన అసమానతల్ని రాకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత ఇప్పుడున్న మావవాళి పైనే ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఎలాంటి చట్టపరమైన, నైతికపరమైన, శాస్త్రీయపరమైన నిబంధనావళి తీసుకొస్తే 'సూపర్ మానవుల' తాకిడిని తట్టుకోగలమన్నది పరిశీలించాలని స్టీఫెన్ హ్యాకింగ్ ఈపుస్తకంలో మానవాళికి సూచించారు.
సూపర్ మానవుల ఆధిపత్యం
ఇప్పటికే మనం 'ప్రపంచీకరణ' ప్రభావంతో కిందామీద పడుతున్నాం. ఉపాధి, ఉద్యోగాలు లేక చదువుకున్న యువత వీధుల్లో తిరుగుతోంది. ఉదాహరణకు అన్ని రంగాల్లో జరుగుతున్న 'ఆటేమేషన్' (యాంత్రికీకరణ) మానవాళికి పెద్ద సవాల్ విసురుతోంది. అత్యంత ప్రతిభాశక్తులు న్నవారిని మాత్రమే ఉద్యోగులుగా నియమించుకుం టున్నారు. సాధారణ ప్రతిభకలిగిన వ్యక్తులు ఎటుపోతే ఏంటి?అన్న విధంగా మారింది. దీనికి తోడు ఇప్పుడు 'సూప ర్ మానవులు' వస్తే ఎలా ఉంటుందో ఊహించాలని స్టీఫెన్ హాకింగ్స్ ఓ హెచ్చరిక చేస్తున్నాడు.
సాధారణ మానవులకు, సూపర్ మానవులకు మధ్య జరిగే ఏ పోటీ అయినా...అందులో సూపర్మానవులే గెలు స్తారు. కాబట్టి ఈ సూపర్ మానవులుగనుక పుట్టుకొస్తే, అప్పుడు వారి చేతిలో ప్రస్తుతమున్న సాధారణ ప్రజలు ఏమవ్వాలి?అని ప్రశ్నించుకుంటే, వారి చేతిలో నశించి పోవాలి. లేదా...వారికి బానిసలుగా బతకాలి.
డబ్బుపై ఆధిపత్యం, కరెన్సీపై ఆధిపత్యం, ఆయుధ సం పదపై, టెక్నాలజీపై ఆధిపత్యం ఉన్న ధనిక దేశాలు నేడు ప్ర పంచాన్ని శాసిస్తున్నాయి. సంస్కృతిపై, సహజ సంపదలపై ఆధిపత్యం ఉన్నవారు...మిగతా మానవాళిని శాసిస్తున్నాయి. ఇంతటితో ఇది ఆగదు. వీరి చేతికి చిక్కిన 'జెనెటిక్ ఇంజ నీరింగ్'తో సూపర్ మానవుల్ని సృష్టిస్తారు. ఇప్పుడు ఈ సూ పర్ మానవుల చేతిలో సాధారణ మానవాళి ఏమైపోవాలి? అని స్టీఫెన్ హ్యాకింగ్ సంధిస్తున్న 'బిగ్ క్వశ్చన్'.
డీఎన్ఏను ఎడిట్ చేసుకోవచ్చు
అయితే ఇదంతా నిజంగానే జరుగుతుందా? అంటే, కచ్చితంగా జరుగుతుందనే హ్యాకింగ్ చెప్పారు. ఇప్పటికే 'మాలిక్యూలార్ సీజార్స్' ఎంతో అభివృద్ధి చెందింది. డీఎన్ఏలకు మూలమైన 'న్యూక్లోటైల్స్'ను ఎడిట్ చేసుకునే స్థాయికి చేరుకున్నాం. డీఎన్ఏను కట్ చేయవచ్చు. కొత్తదాన్ని అందులో చేర్చవచ్చు. అంటే మానవుడి 'డీఎన్ఏ'ను మార్చుకునే స్థాయికి వచ్చింది. ఈ టెక్నాలజీతో ప్రస్తుతం పిండదశలోనే 'డీఎన్ఏ ఎడిట్' చేసుకోవచ్చు. అయితే ఇది అత్యంత ఖర్చుతోకూడిన వ్యవహారం. కేవలం బడా కోటీశ్వరులకు, అంబానీలకు, అదానీలకు ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది.