Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెక్సికో సిటీ : మెక్సికోకు మరో తుఫాను పొంచివుంది. ఈ తుఫాను అత్యంత ప్రమాదకరమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాద ముందని హెచ్చరించారు. తుఫాను నేప థ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. కాగా, ఈనెల 10న మెక్సికోలో మిచెల్ తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుఫానులో చిక్కుకొని 27 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ విపత్తు నుంచి ఇక్కడి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా ఇండ్లను పునర్ నిర్మించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మెక్సికోకు మరో అత్యంత ప్రమాదకరమైన తుఫాను పొంచివుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం...సముద్ర తీరం వెంబడి 215కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని,నదులు పొంగిపొర్లే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.