Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా: టర్కీతో సైనిక సహకారంపై వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో లోపెజ్ టర్కీ రక్షణ మంత్రి హులిసీ అకర్ ఇక్కడ చర్చలు జరిపారు. లోపెజ్కు రక్షణ మంత్రి అకర్ సైనిక వందనంతో స్వాగతం పలికారని అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం ముఖాముఖి భేటీ అయిన ఇరువురు నేతలు రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ పరిస్థితులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. టర్కీ అధ్యక్ష భవన సముదాయంలో జరిగిన ఈ భేటీలో లోపెజ్, ఆయన నేతృత్వంలోని వెనిజులా ప్రతినిధి వర్గానికి టర్కీ ఉపాధ్యక్షుడు ఫౌత్ ఒక్టే స్వాగతం పలికారు. అనంతరం ఇరుదేశాల ప్రతినిధి బృందాలు తమ మధ్య సైనిక, ఆర్థిక సంబంధాలపై పరస్పరం అభిప్రాయాలు తెలియచేసుకున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు రాసిన లేఖలను పాడ్రినో లోపెజ్ ఒక్టేకు అందచేశారు.