Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ విదేశాంగ మంత్రి టిల్లర్సన్పై ట్రంప్ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ''ఆయన రాయి లాగా చలనం లేని మనిషి. బాగా బద్ధకస్తుడు''..అని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తనను అక్రమ నిర్ణయాలు తీసుకునేలా ప్రభావితం చేశారని టిల్లర్సన్ వెల్లడించిన అనంతరం, ప్రతిగా ట్రంప్ ఆయనపై విమర్శలకు దిగారు. టిల్లర్సన్ను తిట్టడంతో పాటు ప్రస్తుత విదేశాంగ మంత్రి మైక్ పాంపియోను పొగిడారు. పాంపియో గొప్పగా పనిచేస్తున్నారని, ఆయన పట్ల గర్వంగా ఉందని అన్నారు. టిల్లర్సన్కు అవసరమైన మానసిక సామర్థ్యం లేదని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఇటీవల టిల్లర్సన్ సీబీసీ న్యూస్‌లో మాట్లాడుతూ...''నేను రోజూ ట్రంప్‌తో మీరు అలా చేయొద్దు, ఏం చేయగలమో మనం మాట్లాడుదాం అని చెప్తూ ఉండడంతో ఆయనకు విసుగు వచ్చినట్టుంది'' అని అన్నారు. తన లాంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తికి ఏమాత్రం క్రమశిక్షణ లేని వ్యక్తితో కలిసి పనిచేయడం కష్టమైన పని అని పేర్కొన్నారు. ఆయన చేయాలనుకున్న పనులు నిబంధనలకు వ్యతిరేకం అని, అలా చేయకూడదని చెప్తే ట్రంప్ చాలా విసుక్కునే వారని అన్నారు. ఇటీవల ట్రంప్ యంత్రాంగం టిల్లర్సన్ను పదవిలో నుంచి తొలగించింది. ఆ స్థానంలో సీఐఏ డైరెక్టర్‌గా ఉన్న మైక్ పాంపియోను నియమించింది. అమెరికా దౌత్యాధికారిగా సెప్టెంబరులో టిల్లర్సన్ సెప్టెంబరులో భారత్‌తో చర్చల్లో పాల్గొన్నారు.