Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాంలో వైట్‌హౌస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ తన పదవి నుంచి వైదొలగనున్నారు. కెల్లీ ఈ ఏడాది చివరల్లో పదవి నుంచి వైదొలగుతారని ట్రంపే స్వయంగా ప్రకటించారు. కెల్లీ గొప్పవ్యక్తి అని ట్రంప్ అభివర్ణించారు. మరో రెండు రోజుల్లో కెల్లీ స్థానాన్ని భర్తీ చేస్తామని ట్రంప్ చెప్పారు. గత కొంతకాలంగా రాజీనామా చేయమని కెల్లీపై తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్టు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తాజాగా ట్రంప్ ప్రకటనతో ఆ వార్త నిజమైంది. ట్రంప్‌తో సంబంధాలు దెబ్బతినడంతోనే కెల్లీ వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క అత్యంత కీలకమైన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి జనరల్ జోయి డన్ఫోర్డ్ కూడా పదవీవిరమణ చేయనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ స్థానంలో జనరల్ మార్క్ మిల్లే బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైట్‌హౌస్ నుంచి 28 మంది కీలక అధికారులు వైదొలగడం గమనార్హం.