Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లోని బలాబలూక్ జిల్లాలో సైనిక స్థావరంపై భారీ ఉగ్ర దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది మృతి చెందారు. మరో 10 మందిని తాలి బన్లు బందీలుగా పట్టుకొన్నారు. భారీ సంఖ్యలోని ఆయుధాలను తాలిబన్లు అపహ రించుకుపోయారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవా దులు గాయపడ్డారు. ఈ విషయాన్ని అఫ్ఘాన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా, అఫ్ఘాన్‌లో కొంతకాలంగా తాలిబన్లు మెరుపుదాడులకు పాల్పడుతున్నారు. సైనిక శిబిరాలు, పోలీస్ చెక్‌పోస్ట్‌లు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో అఫ్ఘాన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగం, అమెరికా సేనలు సంయుక్తంగా తాలిబన్ల ఏరివేతను చేపట్టాయి. దీంతో ఈ దళాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు.