Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా ప్రతినిధికి అమెరికా గస్తీ దళాల హెచ్చరిక
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దుల్లో కొందరు వలసదారులు కంచె దూకి అమెరికాలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ఓ మీడియా ప్రతినిధి సాయంతో సరిహద్దు గోడ దూకి అమెరికాలోకి ప్రవేశించారు. వెంటనే గమనించిన గస్తీ దళాలు వారిద్దరిని అదుపులోకి తీసుకుని తిరిగి వెనక్కి పంపించాయి. ఆ ఇద్దరు వలసదారులకు సహకరించిన మీడియా ప్రతినిధిని అధికారులు హెచ్చరించారు. దక్షిణ అమెరికా దేశాలకు చెందిన వేల మంది నిరాశ్రయులు అమెరికాలోకి ప్రవేశించడమే లక్ష్యంగా కొద్ది వారాలుగా దేశాలన్నీ దాటుకుంటూ మెక్సికో-అమెరికా సరిహద్దు నగరమైన తిజువానాకు చేరుకున్నారు. అక్కడే గుడారాలు వేసుకుని అమెరికా ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు.