Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో ఘటన
వాషింగ్టన్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు గాడి తప్పింది. తన నగ చిత్రాలను ఓ 15 ఏండ్ల వయసున్న విద్యార్థికి పంపింది. ఈ ఫొటోలను సదరు బాలుడి తల్లిదండ్రులు గుర్తించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన అమెరికాలోని కెంటకీలో చోటుచేసుకుంది. రామ్సీ బియర్స్(28) అనే యువతి 2014లో కెంటకీ రాష్ట్రంలో జరిగిన అందాల పోటీల్లో మిస్ కెంటకీ కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె తాజాగా వెస్ట్ వర్జీనియాలోని ఆండ్రూ జాక్సన్ మిడిల్ స్కూల్లో పార్ట్ టైమ్ టీచర్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో గతంలో ఇదే స్కూల్ లో చదువుకున్న ఓ విద్యార్థి(15)కి స్నాప్ చాట్ ద్వారా బియర్స్ తన నగచిత్రాలను పంపింది. అయితే కుమారుడి ఫోన్ను అకస్మాత్తుగా పరిశీలించిన తల్లిదండ్రులు.. టీచర్ నగ ఫొటోలు ఉండటం చూసి కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిన్నారులకు అశ్లీల సమాచారం పంపినట్టు అభియోగాలు నమోదుచేసిన అధికారులు బియర్స్ ను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ గొడవ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం బియర్స్ను సస్పెండ్ చేసింది.