Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలిఫోర్నియా: అమెరికాలోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో, కాలిఫోర్నియా రాష్ట్రంలోని మెన్లో పార్క్ నగరంలోని ఫేస్బుక్ ప్రధాన ప్రాంగణంలో కొన్ని భవనాలను ఖాళీ చేయించారు. ప్రాంగణంలోని 200 జెఫ్ఫర్సన్ డ్రైవ్ భవనంలో బాంబు ఉందన్న అనుమానంతో ఉద్యోగులందర్నీ బయటకు పంపేసినట్టు ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. అయితే ఉద్యోగులంతా క్షేమంగానే ఉన్నారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో ఫేస్బుక్ వెల్లడించింది. భవనం మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు మెన్లో పార్క్ పోలీసులు ట్విటర్ ద్వారా తెలిపారు. గతంలో యూట్యూబ్ సంస్థ కూడా భద్రతా పరమైన ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నది. ఈ ఏడాది మేలో శాన్ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో ఈ లోపం బయటపడింది. ఓ మహిళ ముగ్గురు వ్యక్తులపై తుపాకీతో కాల్పులు జరిపి, తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తూటాల గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.