Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
జెరూసలేం: జెరూసలేంలోని వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో ఓ పాలస్తీనియన్ వీరంగం సృష్టించాడు. జెరూసలేంలోని అసఫ్ జంక్షన్ బస్‌స్టాప్ వద్ద కాల్పులకు తెగబడ్డాడు. అతడి కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ దేశీయులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇజ్రాయెల్ సైనికులను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ కాల్పులకు పాల్పడి ఉండొచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.