Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాలె : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దులా ్ల యామీన్ బ్యాంకు ఖాతాలు తక్షణమే నిలిపివేయాలని స్థానిక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. యామీన్ దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు అక్రమ లావాదేవీలకు పాల్పడి నిధులు పక్కదారి మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈఏడాది సెప్టెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. నిధుల దుర్వినియోగం కేసులో యామీన్ను అదుపులోకి తీసు కొని విచారించే అవకాశముందని పోలీస్ అధి కారులు చెబుతున్నారు. తాజాగా, ఆయన లావా దేవీలు అధికంగా ఉన్న నేషనల్ బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్, మాల్దీవ్ ఇస్లామిక్ బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశించింది. యామీన్ 1.5 మిలియన్ డాలర్ల (రూ.10,79,70,000) నిధులు పక్కదారి మళ్లిం చిన ఆరోపణలు ఎదు ర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అధికార పార్టీ నేతలు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని యామీన్ తెలిపారు.