Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాలీవుడ్ కమెడియన్ పోస్ట్ వైరల్
వాషింగ్టన్ : హాలీవుడ్ కమెడియన్ పీట్ డేవిడ్సన్ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పోస్ట్ అందరికీ ముచ్చెమటలు పట్టించింది. పోలీసులు రంగంలోకి దిగి అతని వద్దకు చేరుకునే వరకు వచ్చింది. ఈ భూమిపై జీవించాలని అనిపించడం లేదని అతను పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. 'నీకోసం ఇక్కడ ఉండటానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ ఎంతవరకు ఉంటాననేది తెలీదు. నాకు ఈ భూమి మీద ఉండాలని లేదు. నేను ఇప్పటి వరకు ప్రజలకు సాయం చేస్తూ వచ్చాను. ఈ విషయం నీతో కూడా చెప్పినట్టు నాకు గుర్తు' అని ఇన్స్టాగ్రాంలో పోస్ట్ పెట్టారు. అంతేగాకుండా, ఆ పోస్ట్ పెట్టిన కాసేపటికి అతను ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నారు. దాంతో అప్రమత్తమైన న్యూయార్క్ పోలీసులు హుటాహుటిన అతని ఇంటికి చేరుకున్నారు. కానీ ఆయన క్షేమంగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.