Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనాలో ఘనంగా 40వ వార్షికోత్సవ వేడుకలు
బీజింగ్: సంస్కరణల బాటలో ప్రయాణం ప్రారంభించి నాలుగు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఇటీవల 40వ వార్షి కోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహి ంచింది. అధ్యక్షుడు సీ జిన్పింగ్, ప్రధాని లీకెకియాంగ్, మంత్రి వర్గ సభ్యులు వాంగ్యాంగ్, వాంగ్ హునింగ్, హన్ఝెంగ్, వాంగ్ కిషన్ వంటి చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలు, ఇతర ప్రముఖులతోపాటు దాదాపు 3 వేల మందికి పైగా ప్రజలు గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గన్నారు. డెంగ్ జియావో పింగ్ సిద్ధాంతాలు ప్రాతిపదికగా 'చైనా పరిస్థితులకు అనువైన సోషలిస్టు సమాజ స్థాపన' అంటూ అధ్యక్షుడు సీ జిన్పింగ్ ఇచ్చిన పిలుపు ప్రధానాంశంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న అధ్యక్షుడు సీజిన్పింగ్ ఇతర నేతలు, ప్రజా ప్రతినిధులతో కరచాలనం చేస్తూ సంస్కరణల అమలులో వారి కృషిని అభినందించారు.