Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖార్తౌమ్ : సూడాన్ సైనిక సంపత్తి గొప్పదని ఆ దేశాధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ కీర్తించారు. ఖార్తౌమ్ నగరంలో పాపులర్ డిఫె న్స్ ఫోర్సెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. సైనిక వందనం స్వీకరించిన అనం తరం మాట్లాడారు. సూడాన్ బల గాలు ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయని అన్నారు. దేశ పౌరులు అధిక సంఖ్యలో సైన్యంలో చేరాలని ఆకాంక్షించారు. 2019 సంవత్సరాన్ని శాంతి సంవత్సరంగా గుర్తిస్తామని అన్నారు. సూడాన్ పౌరుల ఆకాం క్షలకు అనుగుణంగా పాపులర్ డిఫెన్స్ ఫోర్స్స్ విధులు నిర్వర్తిసున్నాయని అన్నారు.