Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణలపై ఓ భారతీయుడిని అరెస్ట్ చేసినట్టు దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన గతేడాది నవంబర్18న చోటుచేసుకోగా ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు ఈనెల28న వెలువడనుంది. దుబాయ్ కి చెందిన ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని థానేకు చెందిన 31ఏండ్ల వ్యక్తి దుబారులోని ఓ షాపింగ్ మాల్లో సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. నవంబర్18న 15 ఏండ్ల ఓ బాలిక తల్లితో కలిసి ఆ షాపింగ్ మాల్‌కు వచ్చింది. తల్లి దూరంగా ఉన్న సమయంలో అతడు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బాలిక, ఆమె తల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా తన తల్లి షాపింగ్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో నిందితుడు తనను వేధించినట్టు పోలీసుల విచారణలో బాలిక పేర్కొంది.అయితే, బాలికకు సహాయం చేసేందుకు ప్రయత్నించానని ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని నిందితుడు చెబుతున్నాడు. షాపింగ్ మాల్లోని సహచర మిత్రులు కూడా నిందితుడి తప్పేమిలేదని మద్దతు తెలపడం గమనార్హం.