Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : న్యూజిలాండ్‌లోని రెండు మసీదుల్లో నరమేధం సృష్టించి 50 మందిని పొట్టనబెట్టుకున్న పాల్పడ్డ బ్రెంటన్ టారంట్..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. టారంట్...ట్రంప్ లాగా ఉన్నారని ఒకరు ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్‌ను లక్షా 31 వేల మంది లైక్ చేయడం .. సోషల్ మీడియాలో ట్రోలవడంతో ట్రంప్ స్పందించారు. మసీదుల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడటానికి, తనకు సంబంధమేంటని ట్రంప్ మండిపడ్డారు. నరమేధం సృష్టించేవారి పట్ల అమెరికా కఠినంగా వ్యవహరిస్తుందని, అలాంటివారికి తామెప్పుడూ మద్దతివ్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించినవారిపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు.