Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖండించిన ఐక్యరాజ్య సమితి
ఐక్యరాజ్య సమితి : అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి గోలన్ హైట్స్‌పై ఇజ్రాయిల్ సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని ఐక్యరాజ్య సమితిలో సిరియా రాయబారి బషర్ అల్ జఫరీ ఖండించారు. అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయానికి విరుద్ధంగా ట్రంప్ ట్వీట్ చేశారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీ తీర్మానాలకు కూడా విరుద్ధమని ఆయన విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా, ఐక్యరాజ్య సమితి నిబంధనావళికి వ్యతిరేకంగా, అంతర్జాతీయ సంబంధాల మౌలిక నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్ వైఖరి వుందని విమర్శించారు. సిరియాకి చెందిన గోలన్ హైట్స్‌ను ఇజ్రాయిల్ అక్రమంగా ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ మండలి చేసిన వివిధ తీర్మానాలను ఆయన గుర్తు చేశారు.