Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఈ వారం పార్లమెంట్లో తన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమోదించాలని కోరకపోవచ్చని బ్రిటీష్ ప్రధాని థెరిస్సా మే పార్లమెంట్ సభ్యులకు తెలిపారు. ఈ బిల్లుకు తగినంత మద్దతు అందని అనిపించినట్లైతే పార్లమెంట్‌కు బిల్లును తీసుకువస్తానని శుక్రవారం రాత్రి థెరిస్సా మే వారికి చెప్పారు. స్పీకర్ అభ్యంతరాలు వున్నప్పటికీ మూడోసారి బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలంటే స్పీకర్ జాన్ బెర్కో అనుమతి అవసరమని అన్నారు. ఇప్పటికి రెండుసార్లు సభలో ప్రవేశపెడితే రెండుసార్లూ బిల్లును ఎంపీలు తిరస్కరించారు. ఏ ఒప్పందం కుదరని పక్షంలో ఏప్రిల్ 12న యురోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగాల్సి వుంది. బ్రిటన్ ముందు ఇంకా కొన్ని అవకాశాలు వున్నాయని ఆమె ఎంపీలకు తెలిపారు. మేలో జరిగే యురోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటన్ పాల్గనే అవకాశాన్ని పొడిగించడంతో సహా పలు అవకాశాలు వున్నాయి. కావాలనుకుంటే బ్రెగ్జిట్ విధానంపై ఎంపీలతో చర్చించడానికి సిద్ధంగా వున్నట్లు థెరిస్సా మే చెప్పారు