Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఉత్తర కొరియాపై పెద్ద మొత్తంలో విధించిన అదనపు ఆంక్షలను తక్షణమే ఉపసంహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఆర్థిక శాఖ ఈ ఆంక్షలను విధించిన వెంటనే ట్రంప్ ఆదేశాలు జారీ అయ్యాయి. ట్రంప్ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ను ఇష్టప డుతున్నారని, ఈ నేపథ్యంలో ఈ ఆంక్షలు అవసరమని భావించడం లేదని ట్రంప్ పత్రికా కార్యదర్శి స్పష్టం చేశారు. గత నెల్లో హనోరులో ట్రంప్, కిమ్ సమావేశమయ్యారని, అయితే ఆంక్షలకు సంబంధించి ఉత్తర కొరియా చేసిన డిమాండ్లు అంగీ కరించడానికి ట్రంప్ నిరాకరించడంతో ఆ సమావేశం విఫలమైంది.ఆ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ''ఉత్తర కొరియాపై ఇప్పటికే వున్న ఆంక్షలకు తోడు అదనపు ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే వాటిని తక్షణమే ఉపసంహరించాలని ఆదేశించాను.'' అని ట్రంప్ ట్వీట్ చేశారు. చైనా షిప్పింగ్ కంపెనీలతో ఉత్తర కొరియా వ్యాపార సంబంధాల కారణంగానే ఈ ఆంక్షలు విధించినట్లు కనిపిస్తోంది. ఈ ఆంక్షలను ప్రకటించిన వెంటనే అటు చైనా, ఇటు ఉత్తర కొరియా ప్రభుత్వాలు ఖండించాయి. ఉత్తర కొరి యాను పూర్తి అణ్వస్త్ర రహితంగా చేసేందుకు అమెరికా, భావసారూప్యత భాగస్వాములు కట్టుబడి వున్నాయని ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ నుచిన్ పేర్కొన్నారు.