Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసాంజెపై ఈక్వెడార్ అధ్యక్షుడి ఆరోపణలు
లండన్ : వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె ఈక్వెడార్ దౌత్య కార్యాలయాన్ని గూఢచర్య కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో ఆరోపించారు. అసాంజెకు ఆశ్రయం కల్పించి తాము పెద్ద తప్పు చేశామని అన్నారు. గూఢచర్య కార్యకలాపాలకు ఈక్వెడార్ కేరాఫ్‌గా మారిందంటూ అమెరికా సహా పలు దేశాలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. 2012లో స్వీడన్లో ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డ కేసులో అసాంజె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈకేసు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2012లో షరతులతో కూడిన బెయిల్ పొందిన అసాంజె కోర్టు విచారణకు సహకరించలేదు. దీంతో, ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. గత గురువారం లండన్ పోలీసులు అసాంజెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు ఏడాది జైలుశిక్ష పడే అవకాశముంది.